Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఎస్సీ సెల్ భూపాలపల్లి
- అధ్యక్షుడు దండు రమేష్
నవతెలంగాణ-మల్హర్రావు
మండల అభివద్ధి, బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఓసీపీలో ఉద్యోగాలు పెట్టిస్తామని స్థానికేతరుల వద్ద అక్రమ వసూళ్ళ బాగోతం, నిర్వాసితుల సమస్యలపై పోరాటం చేస్తున్నది, తదితర అంశాలపై మండల కేంద్రమైన తాడిచెర్ల సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఇటీవల టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరిన విషయం విధితమే. కాగా సోమవారం బహిరంగ చర్చకు వచ్చిన క్రమంలో కొయ్యుర్ పోలీ సులతో తమను అక్రమంగా అరెస్ట్‌లు చేయిస్తారా ? అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు దండు రమేష్, మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండలానికి చేసిన పలు అభివద్ధిపై అన్ని ఆధారాలతో చర్చకు వచ్చినపుడు కొందరిని, చర్చకు రాకముందే తెల్లవారుజామున, మరికొందరిని అరెస్ట్ చేయించడం సరికాదన్నారు. అరెస్ట్ చేసినవారిలో భూపాలపల్లి జిల్లా కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్, సోషల్ మీడియా ఇన్చార్జి నాగరాజు ఉన్నారు.
టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్...
కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు వారం రోజులుగా ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో చేసుకుంటున్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం మండల కేంద్రంలో బహిరంగ చర్చకు సిద్ధమంటే సిద్ధమని ఇరు పార్టీల నాయకులు సవాల్ విసురుకున్నారు. అన్ని ఆధారాలతో టీఆర్ఎస్ నాయకులు చర్చకు వస్తున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుంగా కొయ్యూర్ ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించి ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులు గొనె శ్రీనివాసరావు, కోట రవి,ప్రకాష్ రావు, పీఏసీఎస్ చైర్మన్ రామారావు, కోఆప్షన్ మెంబర్ ఆయూబ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఇరు పార్టీల నాయకులను సాయంత్రం వదిలేశారు.