Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులతో భీభత్సం నెలకొంది. మచ్చాపురం, జవహర్నగర్ గ్రామాల్లోని 163వ జాతీయ రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇండ్ల కప్పులు లేచిపోయాయి. అలాగే జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు, కంచెలు నెలకొరిగాయి. చెట్లు కూలిపోయాయి. ఈ క్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్ వేణు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నేలవాలిన మొక్కలను నిలబెట్టి కంచె ఏర్పాటు చేసే పనిలో పంచాయతీ సిబ్బంది నిమగమయ్యారు. విద్యుత్ లైన్ పునరుద్ధరణలో ఏడీఈ శైలేందర్, సబ్ ఇంజనీర్ రవి, జూనియర్ లైన్మెన్లు రమేష్, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర : మండలంలో ఆదివారం రాత్రి గాలి దుమారం బీభత్సం సష్టించింది. గ్రామాల్లో 3 ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం కాగా, 15 విద్యుత స్తంభాలు విరిగి పడినట్లు విద్యుత్ శాఖ ఏఈ తరుణ్ తెలిపారు. పలు గ్రామాల్లో రేకుల ఇండ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. చెట్లు విరిగి పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా గంటల కొద్ది నిలిచి పోయింది. అధికారులు మరమ్మతులు చేపట్టిన అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయారు.