Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ సర్వర్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో బాగంగా దౌలత్నగర్కు పర్వతగిరి హైస్కూల్ ప్రథానోపాధ్యాయులు జలీల్ తో కరపత్రాలను పరిశీలించిన అనంతరం సర్వర్ మాట్లాడారు. విధ్యార్థులను సుశిక్షితులైన ఉపాధ్యాయులు, ఉచితంగా పుస్తకాలు,బట్టలు,మద్యాహ్నభోజనం ఉండే ప్రభుత్వ బడులకు పంపేలా ప్రోత్సాహించాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. తల్లిదండ్రులను సర్కారు బడులకు పంపించాలని ఆయన చెప్పారు.
నడికూడ : ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటూ మండలంలోని చర్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ సోమవారం ఈదుల కుంట చెరువులో ఉపాధి హామీ పథకం కూలీల వద్దకు వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధిహామీ కార్మి కులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశా లల్లో చదువుకునే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉం టుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్ రెడ్డి, బాబురావు పాల్గొన్నారు.