Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎన్జీవోస్ కాలనీ
రెడ్ క్రాస్ సొసైటీ సుబేదారి రెడ్‌క్రాస్ పాలకవర్గ సభ్యుల అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రాన్ని అత్యాధునిక పరచడానికి పరికరాల కొనుగోలు చేశారు. దీని విలువు రూ. 1.46 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా కొను గోలు చేసిన పరికరాలను సోమవారం తెలంగాణ ఐఆర్ఎస్ చైర్మన్ అజరు మిశ్రా, హనుమకొండ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజీవ్‌గాంధీ ప్రారంభించారు. ముం దుగా రెడ్‌క్రాస్ ఆవరణ లో ఉన్న రెడ్ క్రాస్ జెనరిక్ మం దుల షాప్, టైలరింగ్, జూనియర్, యూత్ రెడ్ క్రాస్, డిసా స్టర్ సెల్ గురుంచి వివరించారు. అనంతరం తలసీమియా సెంటర్‌ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలకవర్గాన్ని అభినందించారు. సీనియర్ చీఫ్ ప్రోగ్రాం మేనేజర్ యన్.వెంకటేశన్ మాట్లాడుతూ హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా స్వచ్చంద రక్తదాతల ద్వారా సేకరించిన రక్తాన్ని తలస ీమియా బాధితులకు, ప్రమాద బాధితులకు, గర్భిణులకు అందించే రక్త కేంద్రాన్ని అత్యాధునిక పరచడానికి అవసరమైన పరికరాలు ఆర్ఈసి ద్వారా సమకూర్చడం సం తోషంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రక్త కేంద్ర మును అత్యాధునిక పరచడానికి పరికరాలు కొనుగోలుకు నిధులను మంజూరు చేసినందుకు కతజ్ఞతలు తెలిపినారు. ఇటీవలే ఐఓసీ ద్వారా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సు సేవలు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ఐఆర్ ఎస్ చైర్మన్ అజరు మిశ్రా మాట్లాడుతూ తెలంగాణలోనే హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం చాలా చురుకుగా పనిచేస్తుం దన్నారు. ముందు ముందు కూడా నా సహకారం ఎల్ల వేళలా ఉంటుందని తెలిపారు. కార్యక్ర మంలో ఐఆర్ఎస్ హన్మకొండ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, ఐఆర్సిఎస్ స్టేట్ జెనరల్ సెక్రటరీ కె మదన్ మోహనరావు, వైస్ చైర్మన్ డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్ రావు, మేనేజర్ (టెక్) ఆర్ ఈ సి, ఆర్ఓ హైదరాబాద్ టి ప్రవీణ్, పరికరాల ఏజెన్సీ ప్రతినిధులు జి. వెంకట్, వేణుగోపాల్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిట్ అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినరు భాస్కర్ తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజరు మిశ్రానుమర్యాద పూర్వకంగా కలిసి రెడ్ క్రాస్ కార్యక్రమాలపై చర్చించి, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.