Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి,
- ఎమ్మెల్యే అరూరి రమేశ్
- గ్రేటర్ 43వ డివిజన్లో పర్యటన
నవతెలంగాణ-ఖిలావరంగల్
త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం వారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ 43వ డివిజన్లోని వినాయక కాలనీ, నక్కలపల్లి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక నగర్ కాలనీలో డ్రెయి నేజీల నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.25లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మిగతా నిధులను కార్పొరేషన్ మంజూరు చేసి పనులు పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా ఈ డివిజన్లో పర్యటించినట్టు తెలిపారు. వినాయక నగర్ కాలనీలో ఖాళీ ప్లాట్లు అపరిశుభ్రంగా ఉన్నందున సదరు యాజ మాన్యాలకు నోటీసులు జారిచేయలని, రోడ్డు ఆక్రమిం చుకొని నిర్మాణాలు చేపట్టినందున అట్టి యజమానులకు టౌన్ ప్లాన్ అధికారులు నోటీసులు జారీ చేయాలని వార్డ్ ప్రత్యేకాధికారిని ఆదేశించారు. వారి వెంట స్థానిక కార్పొ రేటర్ ఈదురు అరుణ విక్టర్, ప్రత్యేకాధికారి సంతోష్ బాబు, ప్రత్యేక వార్డ్ అధికారి వెంకన్న, టీఎంసీ రమేష్, సీఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.