Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి
- ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-చెన్నారావుపేట
గుడిసెలను కూల్చడం దుర్మార్గం అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. భూపోరాట యోధుడు కందికా చెన్నకేశవలు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ అమీనాబాద్ శివారు రెవెన్యూ ఆధీనంలో ఉన్న సర్వే నెం 2532 ,56,57 , 25 27లో గల ప్రభుత్వ భూమిలో నిరుపేదలైన ప్రజలకు ఇండ్లు నిర్మించుకుంటే బినామీ పేరుతో పట్టాలు చేసుకొని అధికార పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. 58, జీవో నెంబర్ ప్రకారం ప్రభుత్వం 125 గజాల భుమిని ఇచ్చి నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాం డ్ చేశారు. అక్రమంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వారిపై కలెక్టర్కు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెళ్లి శ్రీనివాస్, పంజాల రమేష్, రాష్ట్ర నాయకులు, అక్కపెళ్లి రమేష్, సీపీఐ కార్యదర్శి కందిక చెన్నకేశవులు, సంగి ఎలెందర్, దండు లక్ష్మణ్, మినీశ్వర్, అక్బర్, మంద కుమార్, పాషా, శ్యాం, రాజు, కవిత, రాజమ్మ, వసంత సురమ్మ, శకుంతల, కిరమ్మ, ఇందిర, గుడిసెవాసులు పాల్గొన్నారు.