Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ ఆగ్రహం
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని వసంతపూర్లో పారిశుద్ధ్య పనులు సక్రమం గా లేకపోవడం, గేట్ వాల్ వద్ద మురికి నీరు నిల్వ ఉండడంతో వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టి గ్రామాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గ్రామంలో సోమవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జెడ్పీ సీఈవో రాజారావుతో కలిసి గ్రామంలో పర్యటించారు. పల్లె పకతి వనంలో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, గడ్డి ఏపుగా ఎదిగి ఉండడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసు కోవాలని సూచించారు. అనంతరం ప్రగతి సింగారంలో సీతా రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకొని మానసిక ప్రశాంతత పొందాలని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మండలంలోని తాహారాపూర్ గ్రామానికి చెందిన పున్నం సుగుణమ్మ, కోరే రమేష్, శాయంపేటకు చెందిన చెల్పూరి మల్లికాంబ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించగా బాధిత కుటుంబాలను ఆమె సందర్శించి పరామర్శించారు. ఆమె వెంట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, సర్పంచులు ముక్కెర అనూష ప్రేమ్‌సాగర్, పోతు సుమలత రమణారెడ్డి, కందగట్ల రవి, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, ఎంపీవో రంజిత్ కుమార్, ఏ పీ ఓ అనిత, నాయకులు పాల్గొన్నారు.