Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహ్మద్ అబ్దుల్ శుకూర్
నవతెలంగాణ-హన్మకొండ
కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న దినసరి వేతన, లమ్సమ్, కాజువల్ తదితర క్యాడర్లలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచాల్సిం దేనని కేయూ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ శుకూర్ డిమాండ్ చేశారు. సోమవారం విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనం ఎదుట తాత్కాలిక ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెం చాలని భోజన విరామ సమయంలో తాత్కాలిక బోధ నేతర ఉద్యోగుల జాక్ టెంపరరీ ఎంప్లాయిస్ అసోసి యేన్, డైలీ వేజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎస్డి ఎల్సీఈ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన విచ్చేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సం వత్సరాలకు పైబడి విధులు నిర్వర్తిస్తున్నా విశ్వవిద్యాలయ అధికారులు ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం వేతనాలు పెంచకపోవడం శోచనీయమన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో తాత్కాలిక ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే విషయాన్ని విశ్వవిద్యాలయ అధికారులు గుర్తించి సమ స్యను పరిష్కారించాలన్నారు. సుమారు గంటపాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, నాగుల శివప్రసాద్, డాక్టర్ శాగంటి శ్రీనివాస్, కొడవటిగంటి దయాకర్, డాక్టర్ ఆకునూరి సుదయ్య, మూడు సంఘాల నాయకులు, సుమారు 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.