Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందుల్లో గుడిసెవాసులు
- ఆకలితో అలమటిస్తున్న దుస్థితి
- భయభ్రాంతులకు గురవుతున్న గుడిసెవాసులు
నవతెలంగాణ-వరంగల్
జక్కలొద్దిలో ఇళ్లు లేని పేదలు సుమారు నెల రోజుల క్రితం గుడిసెలు వ్ఱెసుకొని నివాసం వుంటున్న విషయం విదితమే జక్క లొద్ది, మైనారిటీ గురుకులం వెళ్లే దారిని పోలీసులు మూసివేసి జక్కలొద్ధికి వెళ్లే బాటసారులను పోలీసులు వాహనాల తనిఖీల పేరుతో బయటి నుండి జక్కలొద్దికి వచ్చే వారిని భయభ్రాం తులకు గురిచేస్తున్నారని గుడిసె వాసులు వాపోతున్నారు. సొంత గ్రామస్తులను సైతం పోలీసులు తమ గ్రామానికి వెళ్లనీ యకుం డా అడ్డుకుంటున్నారు. జక్కలొద్దిలో గుడిసెలేసుకున్న గుడిసె వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రహదారి బంద్ కావడంతో గుడిసెవాసులు బయటికి రావకపోవడంతో తెచ్చు కున్న నిత్యావసర సరుకులు అయిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి మానవుడికి కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలు తప్పకుండా ఉండాలి. తల దాచుకోవడానికి గూడూ తప్పనిసరి. దీనికోసం నెల రోజుల క్రితం గుడిసెలు వేసుకుని ఉంటున్న గుడిసె వాసులు దీనస్థితి చూస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసె వాసులను ఎందుకు ఇంత తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారో అని వారు వాపో తున్నారు. తెలం గాణ రాష్ట్రం వస్తే సొంతిల్లు వస్తుందని చాలా రోజులు నుండి ఎదురు చూసి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కాకపో వడం వలన ప్రభుత్వ స్థలంలో గుడిసె లు వేసుకుంటే ఇటీవల కొంతమంది దుండగులు రాత్రి సమయంలో వచ్చి బీభత్సం సృష్టించారని పోలీసులు మాత్రం ఇప్పటివరకు దుండగులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు గాని గుడిసె వాసు లను మాత్రం పొమ్మనలేక పొగ పెడుతున్నారని వారు వాపో తున్నారు .ఎండలో ఎండుతూ తిండిలేక అలమటిస్తూ పిల్లాపా పలతో గుడిసెల్లో ఉంటూ గుక్కెడు నీళ్లు తాక్కుంటూ బతుకు తుంటే పోలీసులు గుడిసె వాసులపై తీవ్ర ఇబ్బందులకు గురిచ ేస్తున్నారని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడా రాజకీయ నాయకుల హస్తాల్లో పోలీసులు ఉండి గుడిసె వాసు లపై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని గుడిసె వాసులు అనుకుంటున్నారు. జీవో లు ఏమో గానీ తల దాచుకోడం 60 గజాల స్థలం కోసం జక్క లొద్ది లో గుడిసె వేసు కొని ఉంటుంటే ప్రభుత్వ చొరవ లేక బడా రాజకీయ నాయకుల చొరవ ఏమోగానీ గుడిసెవాసులను గుక్కెడు నీళ్లు తాగకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం గుడ ిసెవాసులపై దయచేసి ఇంటి స్థలం ఇచ్చే ఏర్పాటు చేయాలనే గుడిసెవాసులు కోరుతున్నారు.
ఆకలి కోసం పిల్లలు ఏడుస్తున్నారు
- కవిత, జక్కలొద్ది గుడిసెవాసి
చాలా ఏళ్ల నుండి ఉండడానికి ఇల్లు లేక రూం కిరాయి కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడు తున్నాం. జక్కలొద్దిలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి బయటి నుండి జక్క లొద్ది కి రాకుండా చేస్తున్నారు. దీంతో తల దాచు కోడం గూడు కోసం వస్తే కనీసం గూడు దొరకట్లేదు. నిత్యావసర సరుకులు లేక తిం డి లేక పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం గుడిసెలు వాసులపై దయచూపి ఇంటి స్థలం ఇవ్వాలి.
నీళ్లు దొరకట్లేదు
-షరీషాబి, గుడిసెవాసి
ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న తమకు ఇంటి స్థలం ఇవ్వాలి. ఎండకు ఎండి ఆకలికి అలమటిస్తూ నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.చాలా దూరంలో ఉన్న చెరువులు వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. న్యాయమైన హక్కుల కోసం ఇంటి స్థలం కోసం పోరాడుతుంటే పోలీసులు గుడిసె వాసులపై కర్కశంగా వ్యవహరించకుండా ప్రభుత్వం గుడిసెవాసులకు ఇంటి స్థలం ఇవ్వాలి.
పోలీసుల నిర్బంధం ఆపాలి
-ఫాతిమా గుడిసె వాసి
జక్కలొద్దిలో ఉంటున్న గుడిసెవాసులపై పోలీసుల నిర్బంధం ఆపాలి. ముఖ్యమంత్రి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని హామీలను అమలు చేయకపోవడం వల్లే ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నాము. అంతేగానీ ప్రైవేటు స్థలాలను ఆక్రమించు కోలేదు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నాం ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వాలి. ఇప్పటికైనా పోలీసులు నిర్బంధం ఆపాలి.