Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
వానాకాలం సీజన్ వచ్చినందున రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మామునూర్ ఏసీపీ ఏ నరేష్ కుమార్ విత్తన విక్రయ షాపుల యజమానులను హెచ్చరించారు. మండల కేంద్రంలోని తిరుమల సీడ్స్ షాపును, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంగం షాపును సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కంపెనీలకు చెందిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని అందుకు సంబంధించిన రసీదులను తప్పనిసరి వారికి ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా షాప్ లలో ఉన్న స్టాక్ రిజిస్టర్ ను, బిల్లు బుక్కులను విత్తన లైసెన్సు పత్రాలను, సోర్స్ సర్టిఫికెట్, ఇన్వాయిస్ బిల్లు వివిధ రకాల కంపెనీలకు చెందిన విత్తనాల స్టాకు లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి చట్ల యాకయ్య, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ కిరణ్మయి, వ్యవసాయ శాఖ, పోలీసు సిబ్బంది, రైతులు, షాపు యజమానులు తదితరులు పాల్గొన్నారు.