Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య లభిస్తుందని మండల ప్రత్యేక అధి కారి సూర్యనారాయణ, ఎంపీడీఓ శేషాద్రి, ఎంఈఓ గుగు లోతు రాము తెలిపారు. మండల కేంద్రంలో, బ్రాహ్మణ కొత్త పల్లిలో హెచ్ఎం రామ్మోహన్రెడ్డితో కలిసి సోమవారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య నారాయణ, శేషాద్రి, రాము మాట్లాడారు. ప్రభుత్వం పాఠ శాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతోపాటు విద్యార్థు లకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు సైతం ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరిస్తూ విద్యార్థులను ఉన్నతులుగా, ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతారని చెప్పారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలించి కూలీ, ఇతర అంశాల పై అడిగి తెలుసుకున్నారు. అలాగే నర్సరీని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ చింతకుంట్ల యాకన్న, ఎస్ఎంసీ చైర్మెన్లు చిర్ర లింగమూర్తి, కుమ్మరికుంట్ల మౌనేందర్, హెచ్ఎం ఇంద్రసేనారెడ్డి, వార్డు సభ్యులు బొల్లు మురళీ, కారం ప్రశాంత్, పిడుగు మంజుల, టీఎస్ డైరెక్టర్ జిల్లా సోమయ్య, ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్రెడ్డి, ఉపాధ్యాయులు రంజాన్, మానస, నాయకులు అమీర్ పాషా, పిట్టల యాకన్న తదితరులు పాల్గొన్నారు.