Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరిసింగ్నాయక్
నవతెలంగాణ-బయ్యారం
ఈనెల 7న మండలంలో మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరిసింగ్నాయక్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.మండలంలోని చొక్లతండా నుండి గురిమెల్ల వరకు బిటి రెన్యువల్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం, బయ్యారం క్రీడా మైదానంలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రగతి పై సమీక్ష, పబ్లిక్ మీటింగ్, రామన్నపేటలోతార్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, గంధంపల్లి కొత్తపేట, ఇతర 2 చెక్ డ్యాం నిర్మాణంల ప్రారంభోత్సవ కార్యక్రమం, గంధంపల్లిలో 60 లక్షల ఎన్ఆర్ఐ సిసి రోడ్ల నిర్మాణం ఓపెనింగ్ కార్యక్రమం, బయ్యారంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కార్యక్రమం, బయ్యారం హైస్కూల్లో బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ సభ్యులు పులిగండ్ల మాధవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, టిఆర్ఎస్ బయ్యారం మండల పార్టీ అధ్యక్షులు తాత గణేష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, అధికార ప్రతినిధి సత్తిరెడ్డి, ఇల్లందు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లాల్ సింగ్, ఇల్లందు టౌన్ ప్రధాన కార్యదర్శి పరుచూరి, జిల్లా నాయకులు సీతారాం, మండల సోషల్ మీడియా కార్యదర్శి తంగళ్ళపల్లి ఉపేందర్, యూత్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, బోడ రమేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.