Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోడీ..
- హామీల అమలులో టీఆర్ఎస్ విఫలం..
- దోపిడీ రహిత సమసమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
- అట్టహాసంగా జనగామ జిల్లా మూడవ మహాసభలు
నవతెలంగాణ-జనగామ
హామీలు అమలు చేయడంలో విఫలమైన పాలకుల విధా నాలను ఎండగడుతూ కార్మికులు, కర్షకులు, రైతులు కూలీలు సమస్యల పరిష్కారం కోసం సమరానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ జనగామ జిల్లా మూడవ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఫ్రీస్టెన్ పాఠశాల మైదానం నుండి వైష్ణవి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వైష్ణవి గార్డెన్స్‌లో జరిగిన బహిరంగ సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సీహెచ్ జారెడ్డి అధ్యక్షత వహించగా చాడ వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేయలేక పోయిందన్నారు మోడీ పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాడని మండి పడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైందని ప్రశ్నించారు. నూటికి అరవ్కె శాతం ప్రజలు కూడు గూడు చదువుకోసం అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, రైల్వే, నౌకాయానం, బొగ్గు తదితర వి అమ్మేస్తు న్నారన్నారు. ప్రజావ్యతిరేఖ విధానాలతో పాటు మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందన్నారు. ఇటీవల కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారాన్ని రేపాయన్నారు. ధరలను ల్ని నియంత్రించలేక పోయిందన్నారు. మతోన్మాదం ఫాసిస్టు విధానాలను విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏ ఒక్క హామీని అమలుచేయలేదన్నారు.
ఇండ్లు రేషన్‌కార్డులు, పింఛన్లు, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీలపై మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారు. వల్లాభారు పటేల్ వల్లనే తెలంగాణకు విముక్తి కలిగిందనడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణాలో పది లక్షల ఎకరాలు పంచి నైజాంను తరిమి కొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో దోపిడీ పెరిగిందన్నారు. టీఆర్ఎస్ నాయకుల బతుకులు మారాయే తప్ప పేదల బతుకులు మారలేదన్నారు. జనగామ లో భూములు సంపాదించిన ముత్తిరెడ్డి బతుకు మారిం దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్, సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు ఆది సాయన్న పాతూరి సుగుణమ్మ, జిల్లా నాయకులు జీడి ఎల్లయ్య, చొప్పరి సోమయ్య, ఆకుల శ్రీనివాస్, రావుల సదానందం, మంగళంపల్లి జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.