Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి
నవతెలంగాణ-వర్ధన్నపేట
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో, పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా రని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మంగళ వారం మండలంలోని నల్లబెల్లిలో పల్లె ప్రగతి కార్యక్ర మం లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభకు వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీసీసీబి చైర్మన్ మార్నెని రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠదామం, పల్లె ప్రకతి వనం, డంపింగ్ యార్డ్ లను ప్రారంభించారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గ్రామంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్ర మంతో గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ నాయక్, ఎంపీపీ అప్పారావు, జెడ్ పి టి సి మార్గం బిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ కౌడగానే రాజేష్ కన్నా, సర్పంచ్ ముత్యం ఏలెంద్ర సంపత్, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి మాధవరావు, పాల్గొన్నారు.