Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని నవోదయ పాఠశాల వీధిలోని సబ్ సెంటర్ ముందు రోడ్డుపై వేసిన చెత్తను మంగళవారం మల్టీపర్పస్ సిబ్బంది తొలగించారు. ''కానరాని పల్లె ప్రగతి, వారం రోజులుగా రోడ్డుపై వేసిన చెత్తను సేకరించని వైనం'' అనే కథనాన్ని నవతెలంగాణలో ప్రచురితమైన విషయం విదితమే. కథనానికి స్పందించిన పంచాయతీ పాలకవర్గం జిపి సిబ్బందితో చెత్తను తొలగించారు. రోడ్డుపై ఉన్న చెత్తను జి పి సిబ్బంది తొలగించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.