Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్
- 30వ డివిజన్లలోని పలు ప్రాంతాలలో మేయర్, కమిషనర్‌తో కలసి సందర్శించిన చీఫ్ విప్
నవతెలంగాణ-హన్మకొండ
ప్రజల సహకారంతో ఖాళీ స్థలాల పరిరక్షణ చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐదోరోజు బల్దియా పరిధి 30 వ డివిజన్ పరిధిలోని ప్రాంతాలైన బాలసముద్రం, అంబేద్కర్ నగర్ లోని పలుప్రాంతాల్లో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీఫ్ విప్ వినరు భాస్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనేక ప్రజా స్థలాలు కబ్జాలకు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల నుండి సూచనలు సలహాలు స్వీకరించి వాటికి ఫ్రీ కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం అందులో యువకులకు జిమ్ సౌకర్యంతో పాటు సీనియర్ సిటిజన్ కోసం వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేసి గ్రీనరీ ని అభివద్ధి చేస్తామన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రకతి వనాలు, వైకుంఠ గ్రామాలు, క్రీడా ప్రాం గణాలు, నర్సరీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. చెరువు శిఖం భూములు ఉంటే వాటిని గుర్తించి అందులో చెట్ల ను నాటి కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్ చేయడం, డ్రైనేజి ల్లో పూడికతీత, ఖాళీ స్థలాలను శుభ్రం చేయించడం, శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించడం ఈ 15 రోజుల ప్రణాళిక కార ్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ రావుల కోమల కిషన్, డిఎఫ్ఓ కిషోర్, హెచ్ వో ప్రిసిల్లా, డిప్యూటీ కమిషనర్ జోనా, ఈ.ఈ. బి.ఎల్.శ్రీనివాసరావు, డి.ఈ. సంజ రు కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ పాల్గొన్నారు.