Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని మోడీ విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా ములుగు జిల్లా కేంద్రం గట్టమ్మ ఆలయం నుండి రామప్ప గుడి వరకు 17 కిలోమీటర్ల వికాస తీర్థ భైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశమంటే భారతదేశము పౌరులంటే భారతీయులు ప్రపంచదేశాలు ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నా యంటే అది నరేంద్రమోడీ పరిపాలన వల్లనే సాధ్యమైం దన్నారు. అంత్యోదయ పేదలకు అట్టడుగు వర్గాల సేవా కొరకు 80 కోట్ల మంది ప్రజలకు పీఎం గరిబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఆహార ధాన్యాలను అందించారు. అలాగే అర్బన్ కింద 1.22 కోట్ల ఇల్లు మంజూరు చేశారన్నారు. ఆవాస్ యోజన ద్వారా గ్రామీణ పేద ప్రజలకు 2.33 ఇల్లు మంజూరు చేసినట్లు చెఆప్పరు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.22 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, చల్లురి మహేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు మందల విజయ కుమార్ రెడ్డి, అడపా బిక్షపతి, గిరిజన పాలసీ రిసర్చ్ ఇంఛార్జి భూక్య రాజునాయక్ , కిసనమోర్చా జిల్లా అధ్యక్షు డు జినుకల కష్ణాకర్,సీనియర్ నాయకులు సిరికొండ బల రాం, దొంతిరెడ్డి రవిరెడ్డి, బాణాల రాజుకుమార్, అన్న పురెడ్డి ప్రమోద్ రెడ్డి, లవన్ కుమార్ ములుగు మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్, వెంకటాపురం అధ్యక్షుడు భూక్య జవహర్, బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.