Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-వర్ధన్నపేట
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపోందించాలానే లక్ష్యంతో సీఎం సీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అని వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మంగళవారం మండలంలోని 5 వ విడుత పల్లెప్రగతి లో బాగాంగా కొత్తపెళ్లి, ఉప్పరపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకతి వనం, నర్సరి పనుల పురోభివద్ధి ఆమె పరిశీలించారు.ఈ సందర్బంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, అధికారులు సమష్టి కషితో పల్లె ప్రగతి కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ నాయక్, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, కొత్తపెళ్లి ఉప్పర్పల్లి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : సీఎం కేసీఆర్ గ్రామాల అభివద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మం డలంలోని గట్లకానీపర్తి, నరసింహులపల్లి, సూరంపేట గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళ వారం అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డిపిఓ జగదీశ్వర్, డిఎల్పివో కల్పనతో కలిసి ఆమె గ్రామాల్లో పర్యటించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, సర్పంచులు సాంబయ్య, లక్ష్మి, రజిత రఘుపతి రెడ్డి, ఎంపిటిసి రజిని సత్యనారాయణ, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, ఎంపీవో రంజిత్ కుమార్, పాల్గొన్నారు.