Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
కల్యాణలక్ష్మీ పథకం పేద కుటుంబాలకు ఆసరా అని ఏఐసీసీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, సొసైటీ చైర్మన్ తోట రమేష్ అన్నారు. మంగళవారం రెవెన్యూ కార్యాలయ ఆవరణలో తహ సీల్దార్ మహ్మద్ సలీం అద్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుం బాలకు కల్యాణలక్ష్మీ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి లబ్ధిదారు చెక్కులను రెండు జిరాక్స్ తీసుకొని బ్యాంకు ఖాతాలో చెక్కును జమ చేసుకోవాలన్నారు. బ్యాంకులలో ఏదైనా సమస్య వస్తే వెంటనే రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి సమస్యను పరిస్క రించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడివో కర్నాటి శ్రీధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, నాయకులు ఆక రాధాకష్ణ, నాసిరెడ్డి సాంబశివరెడ్డి, నాగిరెడ్డి, టీవీ.హిదాయతుల్లా, చాద మల్లయ్య, హరికష్ణ, పల్లికొండ యాదగిరి, చౌళం వెంకటేశ్వర్లు, చందర్లపాటి శ్రీనివాసరావు, కొమరగిరి సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు రూ.76 లక్షల కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
మండలంలోని అకినేపల్లి మల్లారం, బ్రాహ్మణపల్లి, బుచ్చంపేట, చెరుపల్లి, చుంచుపల్లి, దోమెడ, కోమటిపల్లి, కత్తి గూడెం, కమలాపురం, మల్లూరు, మంగపేట, నర్సాపురం బోరు, నర్సింహాసాగర్, రాజుపేట, రామచంద్రునిపేట, రమణక్క పేట, తిమ్మంపేట, వాడగూడెం గ్రామపంచాయతీలకు చెందిన 76 మంది లబ్దిదారులకు రూ.76 లక్షల 8 వేల 816 చెక్కులను అందజేసినట్లు తహసీల్దార్ సలీం తెలిపారు. ఎస్టీ 17, ఎస్సీ 19, బీసీ 35, ఈబీసీలకు 05 చెక్కులను అందజేసినట్లు తెలిపారు.