Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
మండలంలో పాతమగ్ధుపురం మిషన్ భగీరథ పైప్ లైన్ నర్సంపేట, నెక్కొండ ప్రధాన రహదారి పై 50 కేఎల్ టేయిల్ ఎండ్ పంపు నుండి చుట్టుపక్కల గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. పైప్ లైన్ కలెక్షన్ నడిరోడ్డు మీద లికేజీ కావడంతో నీరు వథాగా పోతుం దని లీకేజీల ద్వారా హైవే రోడ్డు బురద మ యంగా మారుతుంది. వాహనదారులకు ఇబ్బం దికరంగా ఉంటుందన్నారు. గతంలో పైప్ లైన్ లీకే జీలను అరికట్టి ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో, మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు రోజురోజుకు ఎక్కువ కావడంతో మంగళవారం నవతెలంగాణకు స్థానికులు సమా చారం అందించి. ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి లీకేజీలను మరమ్మతులు చేపట్టి తాగునీటి ని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.