Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్‌కు సమస్యలు వివరించిన కార్పొరేటర్ సువర్ణ
నవతెలంగాణ-ఖిలావరంగల్
37వ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేయాలని, పట్టణ-ప్రగతిలో భాగంగా ప్రత్యేక నిధులు కేటాయించి పరిష్కరించాలని కార్పోరేటర్ బోగి సువర్ణ-సురేష్ మున్సిపల్ కమిషనర్‌కు మంగళ వారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరే టర్ మాట్లాడుతూ.. తూర్పుకోట స్మశానవాటిక అభివద్దికి, పోచమ్మ గుడి, బతుకమ్మ బండ కల్వర్టుల నిర్మాణం తదితర పనులు పూర్తి చేయించాలన్నారు. అలాగే యాద వ వాడ 12 కల్వర్టులు, మంచినీళ్ల బావి, పడమరకోట 5వ బ్లాక్ కాపువాడ, ఏస్టీ వాడ బావిలపై కప్పులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నీటి సమస్య పరిష్కారానికీ తూర్పుకోట, దళితకాలనీ, మైనార్టీ కాలనీ, ముదిరాజ్ వాడ, పెరికవాడ, పడమరకొట ఏస్టీ, ఏస్సీకాలనీల్లో యం. యం నగర్, గిరిప్రసాద్ నగర్, బుడిగజంగాల కాలనీలలో పాత చేతి పంపులకు కరెంటు మోటర్లు బిగించి నీటి సమస్య పరిష్కరించాలన్నారు. అలాగే ఏకశిల చిల్డ్రన్ పార్క్ ప్రహరీ కూలి మైనార్టీ ప్రజలకు, పర్యటకులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కమిషనర్ మాట్లాడుతు పై సమస్యల పరిష్కారానికి అధికారులతో ఫోన ్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.