Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
పేద విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లా కేంద్రములో 20 రోజులుగా సీతక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భో జనం వసతి గహాలను మంగళవారం ఆమె సం దర్శించి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్1,2,3 కానిస్టేబుల్ ఉచిత శిక్షణ పొందుతున్న 110 మంది ఎస్సీ, బీసీ, ఓసి విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పి స్తున్నట్లు సీతక్క అన్నారు. సీతక్క విద్యార్థులకు స్వయంగా టిఫిన్ తయారు చేసి వడ్డించారు. కార్యక్రమం లో టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు ఓడ రాజు తదితరులు పాల్గొన్నారు.