Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం
నవతెలంగాణ-గణపురం
మండల పరిధి మోరంచ చెక్ డ్యాం నిర్మాణ పనుల్లో కాసుల కక్కుర్తి జరుగుతోంది. అధికారులు, కాంట్రాక్టర్, కుమ్మక్కై పనులు నాసిరకంగా చేస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నప్పటికి పనులు ఐదు నెలలుగా పూర్తి కాలేదు. వర్షాలు పడితే చెక్ డ్యామ్ కొట్టుక పోయే ప్రమాదం లేకపోలేదు. దీనికి కారణం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. మోరంచ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం నాబార్డ్ నిధులు రూ. 376.33 లక్షలు మంజూరయ్యాయి. ఆ పనులు ఫిబ్రవరి 2న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పనులను త్వరగా పూర్తి చే యాలని వర్షాకాలం లోపు చెక్ డ్యాం ప్రారంభిస్తానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చాడు. అధికారులు, కాంట్రాక్టర్ ఒక్కటై పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. అధికా రులు పర్యవేక్షణ లేకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు కాం ట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడు. అధికారుల పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉండగా అధికారులు లేకుండాన చేస్తున్నారు. ఏఈ, డీఈస్థాయి అధికారులు. దగ్గర ఉండి సిమెంట్, ఇసుక, కంకర, ఎంత మోతాదులో కలపే పనులు వారి సమక్షంలో జరగాలి. కానీ, అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడు. ఒక పక్క నాసిరకం మరో పక్క నత్తనడకన పనులు కొనసాగిస్తూన్నారు. కావాలనే కాంట్రాక్టర్ పనులు ఆలస్యం చేస్తున్నట్లు తెలి సింది. భారీ వర్షాలు పడడం వల్ల చెక్ డ్యామ్ కొట్టుకు పో యిందని సృష్టించి మళ్లీ రీ ఎస్టిమేషన్ వేసి డబ్బులు దండుకునే ప్రయత్నంలో కాంట్రాక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి అధికారులు తోడుకావడంతో పనులు ఆలస్యం అవు తున్నాయి. రైతులకు ఎంతో ఉపయోగపడే చెక్ డ్యామ్ నిర్మాణ పనులు అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన పనులు జరుగుతుండడం పై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.