Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.6లక్షల మరుగుదొడ్ల బిల్లుల స్వాహా : బాధితులు
నవతెలంగాణ-రేగొండ
మరుగుదొడ్ల కింద మంజూరైన రూ.6లక్షలు గోరి కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సీహెచ్ నాగమణి స్వాహా చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకివెళ్తే... మండలంలోని గోరికొత్తపల్లి గ్రామంలో 2019-22వరకు గ్రామంలో నిర్మించుకున్నమరుగుదొడ్ల బిల్లులను బాధితులకు ఇవ్వకుండా, అస్సలు నిర్మించకుండానే 30కిపైగా బాధితుల బిల్లులను పంచాయతీ కార్యదర్శి బంధువుల పేరుపై స్వాహా చేశాడని వాపోయారు. సంబంధిత చెక్కులను బాధితుల సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులను డ్రా చేసినట్లు ఆరోపించారు. సోమవారం జరిగిన గ్రామసభలో డీపీవో ఆశాలత ముందు వెల్లడించామన్నారు. ఈ విషయమై మంగళవారం సర్పంచ్ రజిత రాజయ్య మాట్లాడుతూ.. తాను చదువుకున్న వ్యక్తిని కాదని తెలుసుకొని, తన సంతకాలను ఎక్కడపడితే అక్కడ పెట్టించుకొని, మరుగుదొడ్ల బిల్లులు స్వాహా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనను మోసం చేసి బాధితుల దొంగ సంతకాలను తయారుచేసి మరుగుదొడ్ల బిల్లులు స్వాహా చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి నాగమణి, కారోబార్ నాగరాజు పేరు మీద గతంలో రూ.50వేలవరకు డబ్బులు డ్రా చేసుకొని తీసుకువచ్చి పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినట్లు గ్రామసభలో వెల్లడైందన్నారు. ఇదే కాకుండా గ్రామంలోని అనేక బాధితుల పేరుమీద ఫోర్జరీ సంతకాల ను సృష్టించి డబ్బులు డ్రా చేసినట్లు బాధితులు వెల్లడించారు. 12వ వార్డుసభ్యులు సుదర్శన్, రెండువ వార్డు సభ్యులు మమత, వనం పోశాలుకు చెందిన మరుగుదొడ్ల బిల్లులు కూడా స్వాహా చేసినట్లు వెల్లడించారు. గ్రామానికి చెందిన రవీందర్ పేరుమీద మంజూరైన మరుగు దొడ్ల బిల్లును తన సంతకం లేకుండానే వేలిముద్రతో పంచాయతీ కార్యదర్శి డ్రా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధితఅధికారులు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకొని తమ డబ్బులను రికవరీ చేసి లబ్ధి చేకూర్చాలని కోరారు.