Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామపరిధిలోని మానేరు పరీవాహక ప్రాంతంలో నిర్మాణంలో అసంతప్తిగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్,పీక కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామ శివారు మానేరులో గత ప్రభుత్వం 2007-2009 జలయజ్ఞంలో భాగంగా ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని, రూ.5.92కోట్లు ఖర్చు చేసి అసంతప్తిగా నిర్మాణం చేపట్టారన్నారు. సాగునీరు అందించకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఈ ప్రాంతం బీడు భూములను సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎలాగైతే పోరాటం చేశామో, ఆ తరహాలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం లక్ష్మయ్య, కలవల సమ్మయ్య, మేకల బక్కయ్య, తిరుమల శీను, లక్ష్మిరాజ పాల్గొన్నారు.