Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య
నవతెలంగాణ- మహబూబాబాద్
ఉపాధిహామీ కూలీల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ మండలం వేమునోరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల పైగా ఉపాధి కూలీలు మండుటెండల్లో పని చేస్తుంటే ఫిబ్రవరి నుండి జూన్ వరకు సమ్మర్ అలవెన్స్ రద్దు పరచడం దుర్మార్గమైన చర్య అన్నారు. వారం వారం పే స్లిప్పులు ఇచ్చి వేతనాలు చెల్లించాలని చట్టం చెబుతున్నప్పటికీ నెలల తరబడి కూలీలకు వేతనాలు రాకపోవడంతో అర్ధాకలితో కూలీలు జీవిస్తున్నారని అన్నారు. గత నెల మే 23న న ధర్నా నిర్వహించి ఉపాధి కూలీల సమస్యలను కలెక్టర్ దష్టికి తీసుకెళ్లగా కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా పీడీ కి ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేటికీ అమలు పరచలేదని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు చేపూరి గణేష్, ఉపాధి కూలీలు కొండపాక కోటమ్మ, నాగమ్మ, వెంకటమ్మ, నారాయణ, జంపాల, ఉప్పలమ్మ, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.