Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మండలం, గొర్లవేడు గ్రామ సర్పంచ్ జిల్లా గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం అయినట్లుగా ఎంక్వైరీలో తేలిందని, అయినప్పటికి సర్పంచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత కు వినతి పత్రం అందించి వారు మాట్లాడారు. గొర్లవేడు గ్రామ సర్పంచ్ తాటికంటి శంకర్ 3 ఏండ్లుగా గ్రామ పంచాయితీ నిధులను, ట్రాక్టర్ను ఆయన స్వంతానికి వాడుకున్నాడని, 40 రోజుల క్రితంఆధారాలతో సహా డి.పి.ఓ భూపాలపల్లి గారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. డీపీఓ, మొగుళ్లపల్లి ఎంపీఓ గొర్లవేడు గ్రామపంచాయితికి తనిఖీ అధికారిగా నియమించడంతో విచారణ చేపట్టారనానరు. ఈ విచారణలో నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ అయిందన్నారు. జీపీ ట్రాక్టర్ను వ్యవసాయ పనులకు, కాంట్రాక్ట్ పనులకు వాడుకున్నట్లు ఫొటోలతో సహా నిర్ధారణ అయినట్టు చెప్పారు. 13 పనులలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందని వివరించారు. అధికారులు ఇప్పటి వరకు సర్పంచ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దుర్వినియోగమైన నిధులు రికవరీ చేయించి సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గొర్లవేడు గ్రామస్తులు దండు రాజు, ఐలయ్య, శ్రీనివాస్, ప్రశాంత్, తిరుపతి, రాజు, సారయ్య ,సంతోష్ ,అనిల్, సమ్మయ్య, సుమారు 100 మంది ప్రజలు పాల్గొన్నారు.