Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ గుండె బాబు
నవతెలంగాణ-తొర్రూరు
అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు.మంగళవారం డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం పరిధిలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు చదవటం, రాయటం, ఆటలు, పాటలు, కథలు నేర్పిస్తూ చదువు నేర్చుకునేందుకు అంగన్వాడీ కేంద్రాలు మానసికంగా సిద్ధం చేస్తున్నాయని మున్సిపల్కమిషనర్ అన్నారు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. వార్డు కౌన్సిలర్లు దొంగరి రేవతి శంకర్, గజానంద్, భూసాని రాము, పేర్ల యమునా జంపన్న, అంగన్ వాడి టీచర్లు అలివేలు, ప్రమీళ, సుకన్య, సునీత , లలిత, ఆర్పీ ఉష పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో బడిబాట
మల్హర్రావు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో అంగన్ వాడి కేంద్రాల్లో మంగళవారం అంగన్వాడీ సూపర్ వైజర్ సరస్వతి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిం చారు. రెండున్నర సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్ వాడి కేంద్రాల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. అంగన్ వాడి టీచర్లు,ఆయాలు,చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
మహాముత్తారం : ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలో విద్య బోధన ఉంటుందని మహాముత్తారం సూపర్వైజర్ మమత అన్నారు. మంగళవారం గండి కామారం లొ ఏడబ్ల్యు టి,జయప్రద ఆధ్వర్యంలో గ్రామ మహిళలతో కలిసి పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మి, జయలక్ష్మి, మౌనిక, ఉమా, సీడీపీవో వీరలక్ష్మి మహిళలు పాల్గొన్నారు.
పెద్దవంగర : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పలు సేవలను వినియోగించుకోవాలని జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మరు సుధీర్, సర్పంచ్ వెనకదాసుల లక్ష్మీ శర్మ అన్నారు. మంగళవారం అంగన్వాడీ సౌకర్యాలపై మండల కేంద్రంలో అవగాహన కల్పించి మాట్లాడారు. ఎంపీఓ యాకయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, కార్యదర్శి వెంకన్న, ఉపసర్పంచ్ రాము, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గూడూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం గూడూరు మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాల , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలాని కోరారు. . ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈ విద్యా సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి విద్యార్థికీ ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల బట్టలు, తదితరవి అందజేస్తారన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి విద్యార్థులకు స్కా లర్ షిప్ లు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు యండి. అలీ, కల్యాణి, సులోచన, వి. రాముడు, బత్తుల శ్రీనివాస్, జయశ్రీ, యశోద, కొండమ్మ, షైనాబి పాల్గొన్నారు.
గంగారం : మండలం లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బందం మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని బావురుగొండ, కోమట్లగూడం , కాటినగర్, నర్సిగుడెం, చింతగుడెం, జంగాల పల్లి, గ్రామాల్లో కరపత్రాలతో ంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చించాలని కోరారు. ఉపాధ్యాయులు ఓర్పు స్వామి, సువర్ణ పాక పాపరావు,పున్నెం పుర్ణచంధర్ రావు,జారసత్యవతి, ఈసం సంతొష్ కుమార్, స్వప్న, సర్పంచ్ ఈసం సమ్మయ్య ,విద్యార్థులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.