Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సానుకూలంగా సమాధానమిచ్చిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని జోగంపల్లిలో పల్లె ప్రగతి కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. పిం ఛన్లు రావడం లేదని, మిషన్ భగీరథ నీరు రావటం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం లేదని, ఉపాధి పని చేసి నెలరోజులు గడుస్తున్న కూలీలకు ఉపాధి డబ్బులు పడటం లేదని గ్రామస్తులు గండ్ర దంపతులపై ప్రశ్నల వర్షం కురిపించారు. మిషన్ భగీరథ నీరు వద్దని, గ్రామంలోని మంచినీటి బావి నుండి నీటి సరఫరా చేయాలని, జిపికి సంబం ధించిన మూడు మోటార్లు ఎక్కడ ఉన్నాయన్నాని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది అధికారిక కార్యక్రమమని, రాజకీయ వేదిక కాదని, ఓట్ల కోసం రాలేదని, ఓట్ల కోసం వచ్చే వారు వేరే ఉన్నారని తెలిపారు. గ్రామాలలో జరుగుతున్న అభివద్ధిని కూడా ప్రజలు స్వాగతించాలని అన్నారు. గ్రామాలలో సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నామని, సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పల్లె ప్రకతి వనం వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్య దర్శిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎదుల ప్రమీల రమేష్, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కష్ణమూర్తి, ఎంపీవో రంజిత్ కుమార్, ఏ పీ ఓ అనిత, నాయకులు పాల్గొన్నారు.