Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
బాలలు పనిలో కాదు బడిలో ఉండాలని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్ అన్నారు. శుక్రవారం బాలల హక్కుల రక్షణ, వారి సమస్యల పరిష్కారం పై చైల్డ్ లైన్ మండల ఇన్చార్జి రాంచరణ్ ఆధ్వర్యంలో చెంచుపల్లి గ్రామంలో మండల స్టేక్ హౌల్డర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో సునిల్ పాల్గొని మాట్లాడారు. మండలంలో బాలల హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు. బడి మానేసిన బాలలు, వీధి బాలలు, అనాధ బాలలు, నిరాధారణకు గురైన బాలల సమాచారాన్ని చైల్డ్ లైన్ 1098కు సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాలల సమస్యలు లేని మండలంగా రేగొండ మండలాన్ని తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెంచుపల్లి గ్రామ సర్పంచ్ బండి లచ్చుమక్క, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాపయ్య, డీసీపీయూ ఔట్ రీచ్ వర్కర్ సోషల్ కుమార్, చైల్డ్ లైన్ మెంబర్ ఆనంద్, ప్రవీణ్, అంగన్వాడీ టీచర్ యామిని తదితరులు పాల్గొన్నారు.