Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని నార్లాపూర్కు చెందిన కుక్కల కేతమ్మ ఇటీవల మృతి చెందగా ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం పరామర్శించారు. తొలుత కేతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం సీతక్క మాట్లాడారు. కేతమ్మ మృతి బాధాకరమన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొల్లు దేవేందర్, సహకార సంఘం చైర్మెన్ పులి సంపత్ గౌడ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముజఫర్, తాడ్వాయి సర్పంచ్ ఇరుప సునీల్, గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్క శ్రీనివాస్, మొక్క సమ్మయ్య, మొక్క దుర్గయ్య, మాజీ ఎంపీపీ ఎనుగంటి రామయ్య, మాజీ సర్పంచ్ ఊకే సారయ్య, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు తాలూకా సంపత్, సహకార సంఘం డైరెక్టర్లు పుర్రి కళ్యాణ్, ఎనుగంటి నరేష్, సిద్దిరెడ్డి, శ్రీనివాస్, రాజు, రమేష్, కొమురయ్య, మల్లయ్య, సతీష్, తదితరులు పాల్గొన్నారు.