Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
పల్లెప్రగతి విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మండలంలోని గుర్తూరులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పల్లెప్రగతిని విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఇప్పటివరకు నాటిన మొక్కలు బతికేలా, ప్రజలు వైకుంఠధామాలను వినియోగించుకొనేలా చూడాలని సూచించారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పంచాయతీలకు రావాల్సిన రూ.1400 కోట్లను మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు మాట్లాడుతూ పల్లెల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. అనేక ఏండ్లుగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమౌతూ అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని మహిళా సంఘాలకు రూ.8.47 కోట్ల రుణాల చెక్కులను మంత్రి దయాకర్‌రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణ అభివద్ధి కమిషన్ డైరెక్టర్ లింగాల వెంకటనారాయణ గౌడ్, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాద్, డీపీఓ సాయిబాబా, జెడ్పీ సీఈఓ రమాదేవి, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీవో రమేష్, ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ రాఘవరెడ్డి, సర్పంచ్ మోత్కూరి రవీంద్రచారి, ఎంపీటీసీ మేరుగు మాధవి రమేష్, నాయకులు డాక్టర్ సోమేశ్వర్రావు, పసుమర్తి సీతారాములు, మేరుగు ప్రకాష్, విస్సంపల్లి బాలకృష్ణ, ఈదురు వెంకన్న, దేవరకొండ శ్రీనివాస్, మల్లయ్య, సింగారపు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని పసరలో సర్పంచ్ ముద్దబోయిన రాము ఆధ్వర్యంలో విద్యుత్ లైన్లకు ఏఈ హనుమాన్‌దాస్, లైన్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజ్‌కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శరత్‌బాబు, లైన్మెన్ సుధీర్ కుమార్, జేఎల్ఎం భిక్షపతి, సిబ్బంది సోమిరెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కోటగడ్డలో..
మండలంలోని కోటగడ్డ గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. క్రీడా ప్రాంగణాలకు స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు. స్మశానవాటికను, పల్లె ప్రకతి వనాలను సందర్శించి పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అల్లం రాజకుమార్, ఈజీఎస్ ఏపీఓ ప్రసూన, ఎంపీఓ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని కోమటిపల్లిలో చేపట్టిన పల్లెప్రగతి పనులను తహసీల్దార్ మహ్మద్ సలీమ్, ఎంపీడీఓ కర్నాటి శ్రీధర్‌లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేష్ సందర్శించి పరిశీలించారు. పారశుద్య పనుల తీరుపై గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. అనంతరం పల్లె ప్రకతి వనాన్ని సందర్శించి చెట్ల ఎదుగుదలకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తీసుకున్న శ్రద్దను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర : మండలంలోని మోత్యాతండాలో పల్లెప్రగతి నిర్వహించగా పాలకుర్తి ఆలయ కమిటీ చైర్మెన్ రామచంద్రయ్య శర్మ, స్పెషల్ ఆఫీసర్ ఖుర్షీద్‌తో కలిసి జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడారు. గామంలో ఫ్రైడే, డ్రైడే చేపట్టి పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిట్యాలలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలయ్య, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ ధారావత్ భీమా, ఎంపీటీసీ సబిత, కార్యదర్శి సురేందర్ పాల్గొన్నారు.