Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడిబాటపై సమీక్ష
నవతెలంగాణ-పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడా నికి పాటుపడాలని ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి కోరారు. మండల విద్యా వనరుల కేంద్రంలో బడి బాట కార్యక్రమంపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ల ప్రాధాన్యతను, వసతులను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. ఆవాస ప్రాంతాల్లోని నివాసితుల వివరాలను సేకరించాలని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపుతున్న తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ యాకయ్య, మండల ప్రతేక అధికారి సయ్యద్ ఖుర్శీద్, నోడల్ హెచ్ఎం భిక్షపతి, కాంప్లెక్స్ హెచ్ఎంలు విజరుకుమార్, వెంకన్న, హెచ్ఎంలు, సీఆర్పీలు నిరంజన్, సంతోష్, రంగన్న, రమాదేవి పాల్గొన్నారు.