Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-కొత్తగూడ
కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు సుపరిపాలన అందిందని ఆ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం రైతు డిక్లరేషన్ రచ్చబండ నిర్వహించారు. దుకాణాల్లో, వారాంతపు సంతలో రైతు డిక్లరేషన్ గురించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి కుటుంబ పాలన కోసం ఆరాటపడుతోందని విమర్శించారు. అటవీ శాఖ అధికారులతో ఏజెన్సీలోని సాగు భూములను హరిత హారం పేరుతో బలవంతంగా లాక్కుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతు డిక్లరేషన్‌లో పొందుపర్చిన అన్ని హామీలనూ అమలు చేస్తామని తెలిపారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
తహసీల్ కార్యాలయంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే సీతక్క కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బానోత్ విజయ రూప్సింగ్, జెడ్పీటీసీ పులుసం పుష్పలత, సర్పంచ్ మల్లెల రణధీర్, టీపీసీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, రూప్సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, నాయకులు ఉల్లెంగుల రమేష్, సయ్యద్, కొత్తగూడ, గంగారం మండలాల తహసీల్దార్లు చందా నరేష్, సూర్యనారాయణ, ఎంపీపీలు విజయ రూప్సింగ్, సరోజన జగ్గారావు, వైస్ ఎంపీపీ జంపయ్య, వీరభద్ర, నాయబ్ తహసీల్దార్ నర్సయ్య, స్థానిక సర్పంచ్ రణధీర్, అర్ఐ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : డివిజన్ కేంద్రంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కందాడి అశోక్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉందని చెప్పారు. తొలుత కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవినాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూర్ రూరల్ : మండలంలోని కంఠాయపాలెంలో రచ్చబండ నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి, నాయకుడు మేకల కుమార్‌తో కలిసి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యానాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో రచ్చబండ కోఆర్డినేటర్ చిన్నపాక ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కందాడి అశోక్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.