Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహాముత్తారం
'మన ఊరు- మన బడి'తో గ్రామీణ పాఠశాలలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహా ముత్తారం మండల పరిధి రెడ్డిపల్లి సర్పంచ్ అజ్మీర విమల ఫుల్ సింగ్ నాయక్ అన్నారు. శుక్రవారం రెడ్డిపల్లి లో తెలంగాణ ప్రభుత్వం అదనపు గదులకు నిదులు మంజూరు చేయగా సర్పంచ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శరత్, వినరు సాగర్, ఉప సర్పంచ్ తోలెం అనిత శ్రీనివాస్, వార్డు సభ్యులు, కార్యదర్శి మహమ్మద్ గౌస్,ఎ ఈ రమేష్, పాల్గొన్నారు.
రేగొండ : బడి బాటతోనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతంగా తయారవుతాయని బాగిర్తిపేటఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బాగిర్తిపేట ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులతో గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ నూతన అడ్మిషన్ల ప్రక్రియ నమోదు చేపట్టారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిందని దీన్ని విద్యార్థులందరూ సద్వినయోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు వేల్పుల రాజు, సంధ్య, శ్రీనివాస్, మురళి, అనురాధ, సూదం సాంబమూర్తి, చంద్రమౌళి, రమేష్ సరిత పాల్గొన్నారు.
మహాదేవపూర్ : మహాదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో బాలింతలకు సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ రాణి భారు ఎంపీడీవో శంకర్‌నాయక్ , సీడీపీఓ రాధిక, సూపర్వైజర్ సరస్వతి వైస్ ఎంపీపీ పుష్పలత, సర్పంచ్ పద్మా రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, అంగన్వాడి టీచర్ సిహెచ్ శ్రీలత, పాల్గొన్నారు.