Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఈఓ దివాకర్ జోరుగా బడిబాట
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన లభిస్తుందని ఎంఈఓ దివాకర్ తెలిపారు. మండలంలోని పస్రాలో శుక్రవారం నిర్వహించిన బడిబాట కారక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుబాటులోకి రానుందని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తారని వివరించారు. ఉచితంగా భోజనం, పాఠ్యపుస్తకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు చాప బాబు, సోమేశ్వర్రావు, రామరాజు, రాజు, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూర్ రూరల్ : మండలంలోని కొమ్మనాపల్లిలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాయిపెల్లి యాకయ్య, సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బ్యాండ్ మేళంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. అనతంరం సర్పంచ్ రమేష్ మాట్లాడారు. ప్రజలు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు దామోదర్, అంగన్వాడీ టీచర్ సునీత, ఆయా గమ్మీ, తదితరులు పాల్గొన్నారు.