Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీ తండాలో లేగదూడలు పంపిణీ
నవతెలంగాణ-పెద్దవంగర
రైతులు పశుసంపదను వద్ధి చేసుకోవాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ (టీజీఎఫ్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ కోరారు. మండలంలోనిఎల్బీ తండాలో మహేశ్వరి గోశాల ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా లేగ దూడలను సర్పంచ్ తార పూల్సింగ్తో కలిసి శుక్ర వారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ అగర్వాల్ మాట్లాడారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలంటే సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని సూచించారు. రైతులు గోవులను పెంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించినట్లయితే అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. భూసారమూ పెరుగుతుందని చెప్పారు. రసాయనిక ఎరు వుల వాడకం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతోపాటు మానవ మనుగడ దెబ్బతింటుందని ఆందోళన వెలి బుచ్చారు. కార్యక్రమంలో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల గోశాల కార్యనిర్వాహకుడు గౌరీ నాయుడు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.