Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్య భద్రత అని 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీరజాలి అన్నారు. నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాజీపేట పట్టణం 63వ డివిజన్ సెయింట్ ఆన్స్ పాఠశాల, సోమిడి రోడ్డు, ఆర్యనగర్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ విజయశ్రీరజాలి పారిశుద్ధ కార్మికులతో వీధివీధిన తిరు గుతూ శుభ్రం చేయించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్ స్పెక్టర్ గోపి, మునిసిపల్ జవాన్ రవి, ఆపరేటర్ మధు, అంగన్వాడీ టీచర్లు అరుణ, దేవి, విజయమని, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికార యంత్రాంగంతో కలిసి 4వ డివిజన్ పెద్దమ్మ గడ్డ, యాదవ నగర్ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్, కుడా చైర్మన్ సగంరెడ్డి సుందరరాజ్ యాదవ్ సమస్యాత్మకమైన పలు పనులను గుర్తించారు. చేపట్టబోయే పలు అభివద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికుల నుండి పలు విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, స్థానిక కార్పొరేటర్ బొంగు అశోక్, డివిజన్ అధ్యక్షులు మనోజ్, తదితరులు పాల్గొన్నారు.