Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
మండల కేంద్రంలో సఖి వన్ స్టాప్ కేంద్రం హనుమకొండ ఆధ్వర్యంలో విఓఏ వర్కర్ వి. వినీల, పారామెడికల్ కె.హరిత మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి వన్ స్టాఫ్ కేంద్రం కేస్ వర్కర్ వినీలా మాట్లాడుతూ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్, మహిళా అభివద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ నిర్వహిస్తున్నారని విడిపోయే భార్యాభర్తలను కౌన్సెలిం గ్ ద్వారా ఒకటిగా కలపడం, వరకట్న, లైంగిక వేధిం పులు, ఆడపిల్ల వద్దని అకారణంగా గర్భస్రావం చేయిం చాలి వేధింపులకు గురి చేయడం, వేధింపులపై మానసికంగా కంగి పోయే మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించడానికి సఖి వన్ స్టాఫ్ కేంద్రం కషి చేస్తుందన్నారు. సమస్యలపై సహాయం కోసం సఖి కేం ద్రంకు వచ్చిన మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్ సహా యం, న్యాయ సహాయం, పోలీస్ సహాయం, వైద్య సహాయం, తాత్కాలిక వసతి వంటివి సఖి కేంద్రం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకోవాలని, 0870-2452112, టోల్ ఫ్రీ నెంబర్ 181కు ఫోన్ చేయగలరని మహిళలను, పాఠశాల బాలికలను కోరా రు. సమావేశంలో సఖి వన్ స్టాప్ కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.