Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని తాహారాపూర్లోని గోగుంట చెరువును కబ్జా రాయుళ్లుయధేచ్చగా కబ్జా చేస్తున్నారు. చెరువు మధ్యలోనే ఏకంగా సిమెంట్ ఖనిలు పాతి కబ్జాకు యత్నిస్తున్నారు. చెరువు ఆయకట్టు రెండు పక్కల 26 ఎకరాలు సాగు విస్తీర్ణం అవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువును కబ్జాకు గురవుతున్నట్లు చెరువుపై ఆధారపడిన ఆయకట్టు రైతులు, చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు చెబు తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి చెరువు కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకొని, కబ్జాదారులను కఠినంగా శిక్షించి, గోగుంట చెరువును పరిరక్షించాలని రైతు సం ఘాల నాయకులు, గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.