Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా అధికారులున్నా.. నిబంధనలకు భిన్నంగా అధికారుల ప్రవర్తన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి :
జక్కలొద్ది పేద మహిళలపై మామునూరు సిఐ బి. రమేష్ నాయక్ చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. గత నెలరోజులుగా జక్క లొద్దిలోని ప్రభుత్వ భూమిలో భూమి లేని పేదలు ఇండ్ల స్థలాలు కావాలని గుడిసెలు వేసుకున్న విషయం విది తమే. వేయి మంది పోలీసు బందోబస్తుతో బలవం తంగా వారందరినీ ఖాళీ చేయించి గుడిసెలను దహనం చేసిన పోలీసులు తాజాగా శుక్రవారం మళ్లీ గుడిసెలు వేసుకోవడానికి విచ్చన పేద మహిళలపై చేయి చేసుకున్నారు. మహిళా ఎస్సైలు, పోలీసులున్నా సిఐ రమేష్‌నాయక్ మహిళలపై చేయి వేసి నెట్టేయ్యడం గమనార్హం. ఇదిలావుంటే పలువురు మహిళలపై చేయి చేసుకోవడంతో గాయపడ్డ మహిళలు ఎంజిఎం ఆసుపత్రికి వెళ్లి వైద్యసాయం తీసుకున్నారు. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఇదిలావుంటే పోలీసుల రక్షణలోనే ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేసే కార్యక్రమం సాగుతుంది. ఇది ప్రభుత్వం పనేనా..? లేక తెర వెనుక కబ్జా రాయుళ్ల పనా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. జక్కలొద్దిలో మళ్లీ గుడసెలు వేసుకోవడానికి వచ్చిన వందలాది మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మహిళా ఎస్సైలు, కానిస్టే బుళ్లు వున్నా మామునూరు సిఐ బి. రమేష్‌నాయక్ మహిళలపై చేయి వేసి నెట్టి వేయడం గమనార్హం. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ప్రతి పోలీసు స్టేషన ్లో మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్లను ఇటీవల భారీగా నియమించిన విదితమే. శుక్రవారం జరిగిన ఈ సంఘటన సమయంలోనూ మహిళా ఎస్సైలు, మహిళా కానిస్టేబుళ్లు వున్నారు. అయినా సిఐ మహిళలపై చేయి వేసి నెట్టి వేయడం పట్ల మహిళలు తీవ్ర నిరసన తెలి పారు. నియమ, నిబంధనలకు భిన్నంగా సిఐ రమేష నాయక్ మహిళలపై చేయి వేయడం చర్చనీయాంశంగా మారింది.
మహిళల ఆందోళన
గుడిసెలు వేసుకోవడానికి వచ్చిన పేద మహిళలను అడ్డుకోవడంతో వారంతా అక్కడే బైఠా యించి ఆందోళనకు దిగారు. సిఎం కేసీఆర్ డౌన్ డౌన్.. ఇండ్ల స్థలాలు ఇవ్వా లంటూ పెద్దపెట్టున నినా దాలు చేశారు. సిపిఐ(ఎం) జిందాబాద్ అంటూ నినా దాలు చేశారు. మమ్మల్ని అన వసరంగా అడ్డుకుం టున్నా రని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వ స్థలంలో ఇండ్ల స్థలాలు లేని మేము గుడిసెలు వేసుకుంటే తప్పేంటి ? అని పోలీసులను ప్రశ్నించారు. ఎకరాలకొద్ది ప్రభుత్వ భూములను కబ్జా చేసే కోటీశ్వర్లును సర్కార్ ఏం చేస్తుంది ? మీరేం చేస్తున్నరు ? అంటూ ప్రశ్నలు వేయడంతో పోలీసులతో మహిళల మధ్య వాగ్వివాదం జరిగింది. సిఐ రమేష్ నాయక్‌తో పలువురు మహిళలు వాగ్వివాదానికి దిగారు.
మహిళలపై దాడి
జక్కలొద్దిలో గుడిసెలు వేసుకోవడానికి వచ్చిన మహిళలపై పోలీసులు దాడి చేయడంతో పలువురు మహి ళలు గాయపడ్డారు. గర్భిణీస్త్రీ సొమ్మసిల్లి పడిపోవడంతో మహిళలు పోలీసులను శాపనార్ధాలు పెట్టారు. మహిళలపై చేయి చేసుకోవడం ఏమిటీ ? అంటూ ప్రశ్నించారు. సిఐ డ్రైవర్ తన్నడంతో ఒక మహిళ కిందపడిపోయింది. దీంతో మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మహిళలకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో కిందపడిపోయి గాయడ్డ మహిళలు ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందారు.
పోలీసు రక్షణలో కంచె ఏర్పాటు పనులు..
జక్కలొద్దిలో పోలీసుల రక్షణలో ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు ప్రభుత్వం చేస్తుందా? భూ ఆక్రమణదారులు చేస్తున్నారా? అన్న సం దేహాలు వ్యక్తమవుతున్నాయి. జక్కలొద్ది భూములను పలు వురు ప్రజాప్రతినిధులు, కోటీశ్వరులు కబ్జా చేశారనే విష యం తెలిసిందే. పేదలు గుడిసెలు వేసుకోగా వారిని బలవంతంగా ఖాళీ చేయించి, ఆ గుడిసెలను పోలీసులు దహనం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం ఈ భూమి చుట్టు కనీలు పాతి కంచెను ఏర్పాటు చేస్తున్నారు.