Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెలను తొలగించి పేదలకు నిలువ నీడ ఉండం ఇవ్వని ప్రభుత్వం
- పేదల ఓట్లతో గెలిచి పోలీసులతో దమనకాండ చేయించావు ఖబర్దార్ కేసీఆర్
- జక్కలొద్ది సందర్శనలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు
నవతెలంగాణ-మట్టెవాడ/వరంగల్
జక్కలొద్దిలోని ప్రభుత్వ స్థలంలో వేలాదిగా వేసుకున్న గుడిసె వాసులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించి గుడిసె వాసులపై బుల్డోజర్లను రంగంలోకి దించడంతో గాయపడ్డ గుడిసె వాసులను శుక్రవారం అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన వివిధ పార్టీల నాయకులు జక్కలొద్దిలో దహనమైన గుడిసెల స్థలాన్ని సందర్శించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఎదురు వెళ్లి పోరాడుతూ పోలీసుల లాఠీ దెబ్బలకు గాయపడ్డ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు కాం గ్రెస్ పార్టీ వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షులు నాయిని రాజేందర్, వైఎస్ ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కౌశిక్ రెడ్డి, మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలు గుడు కోసం కొన్ని నెలలుగా ప్రభుత్వ భూమిలో గుడి సెలు వేసుకుంటే వారిని దౌర్జన్యంగా పోలీసులతో కొట్టించి బుల్డోజర్లు ఎక్కించి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హెచ్చరించారు. 8 ఏళ్లుగా వేలకు వేలు ఇల్లా కిరాయిలు కట్టలేక కడుపు రగిలి ప్రభుత్వ స్థలంలో తల దాచుకోవడం కోసం గుడిసెలు వేసి జీవనం కొనసాగిస్తుంట్టే కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ రాత్రి బుల్డోజర్ లను ప్రయోగించి పోలీసులతో కొట్టించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. 291 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా బడాబాబులు కబ్జాకోరులు 240 ఎకరాలలో ప్రహరీలు నిర్మించి ఫాం హౌస్లు కట్టుకొని విలాసమైన జీవితం గడుపుతుంటే వారిని వదిలేసి 50 ఎకరాల స్థలంలో ఎనిమిది వేల మంది గుడిసెలు వేసుకుంటే వారిపై దౌర్జన్యం చేయడం అన్యాయమని అన్నారు. పేదల ఓట్లతో గెలిచి అధికారం వెలగబెడుతున్న కెసిఆర్ పేదలకు స్థలం దక్కే వరకు అఖిలపక్షం వారికి అండగా నిలబడుతుందని గుడిసె వాసులకు అండగా ఉంటామని హెచ్చరించారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ బుల్డోజర్లు ఏ కాదు సీఎం వచ్చిన జక్కలొద్ది లోని ప్రభుత్వ స్థలాన్ని పేదలకు దక్కే వరకు సిపిఐ(ఎం) పార్టీ పోరాడుతుందని అన్నారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తి , ప్రజల ఆస్తిలో పేదలకు స్థలాలు ఇవ్వాల్సిందే అది మన హక్కు దానికోసం పోరాడాల్సిందే పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం అలాగే పోరాడితేనే ఇంటి స్థలాలను సాధించుకుంటాం అని అన్నారు. సిపిఐ(ఎం) పార్టీ తో పాటు అన్ని పార్టీలు పేదలకు అండగా నిలిచాయి అని భయపడకుండా స్థలాలు దక్కే వరకు పోరాడుతామని అన్నారు. గుడిసె వా సులను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నామిన్డ్ల శ్రీనివాస్ ఎంఆర్పిఎంఎస్పి జిల్లా కన్వీనర్ బిల్లు మహేందర్ ఆర్ ఎస్ పి నాయకులు శివాజీ, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్, డిబిఎఫ్ సంఘం సభ్యులు రాజేందర్, తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు జన్ను నర్సయ్య, ఎస్ కె ఎస్ ఎం వ్యవస్థాపకులు గడ్డం సుధాకర్, కెవిపిఎస్ నాయ కులు ఆరూరి కుమార్, ఆవుల ఉదరు, తదితరులు పాల్గొన్నారు.