Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
విధి నిర్వహణలో భాగంగా అధికారులకు చేయాల్సిన విధుల పట్ల నిర్ణీత గడువులో పూర్తి చేయాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సూచించారు. శుక్రవారం కమిషనరేట్‌లో పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పెండింగ్‌లో వున్న దర్యాప్తు కేసులు, వివిధ కేసుల్లో మెడికల్ రోపోర్ట్స్, పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్, డయల్ 100, సన్నిహిత పిటీషన్లతోపాటు ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్‌పై విశ్లేషణ, దొంగతనాల నియంత్రణ మరియు సైబర్ నేరాలపై అవగాహన, కేసుల నమోదు తీరుతెన్నులపై పోలీసు కమిషనర్ అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లోని నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకుగాను అవలంభించాల్సిన తీరును పోలీసు కమిషనర్ అధికారులకు సూచించారు. డిసిపిలు, అదనపు డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ అధికారులు పోలీసు స్టేషన్లో నమోదయ్యే కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుసరించి దర్యాప్తు చేయాల్సి వుండని, ముఖ్యంగా నేరస్తుడి నేరాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించడం కోసం అధికారులు వ్యక్తగత శ్రద్ధతో విధులు నిర్వహించాల్సి వుంటుందన్నారు. కేసుకు సంబంధించి అనుబంధ విభాగాల నుండి అందాల్సిన పత్రాలు రావడంలో ఆలస్యం జరిగితే నా దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా ప్రజావాణి సందర్భంగా ప్రజలు చేసే ఫిర్యాదులపై అధికారులు త్వరి తగతిన పూర్తి చేసి సమగ్రమైన నివేదిక అందచే యాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనపర్చడంతోపాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై పోలీసు అధికారులు సంబంధిత అధికారులతో విశ్లేషణ చేసి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు అశోక్‌కుమార్, వెంకటలక్ష్మీ, సీతారాం, అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.