Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ నాయక్
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిశుభ్రత పచ్చదనంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటికి మొక్కలు నాటడంతో పాటు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ నాయక్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. వర్ధన్నపేట పురపాలక సంఘం నందు 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమములో భాగంగా 10వ రోజు నాటి కార్యక్రమము ఇంటింటికీ తడి చెత్త, పొడిచెత్త వేరు చేసే విధానం, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో ఉన్న ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త పై వారులలో ఇంటి యాజ మానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే చెత్త బయటి ప్రదేశాలలో వేయ కుండా మున్సి పాలిటీ వాహనంలో మాత్రమే వేయాలి అన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో వాడే మురికి నీరు రోడ్లపై వదలకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వాడకంలోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ అంగోతు అరుణ, కమీషనర్ గొడిశాల రవీందర్, వార్డు కౌన్సిలర్లు మంచాల రామకృష్ణ, తుమ్మల రవీందర్ , వార్డు ఇంచార్జ్ లు పాల్గొన్నారు.