Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలంలోని బస్వరాజుపల్లి కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్టు ఓసీ-త్రీలో సెక్యూరిటీ గార్డ్ సుంకరి. కమలాకర్ రెడ్డి పై శనివారం రాత్రి 11 గంటలకు కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కమలాకర్ రెడ్డిని తోటి సిబ్బంది సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గణపురం మండలం నగరం పల్లి శివారు కొండం పల్లి గ్రామానికి చెందిన కమలాకర్ రెడ్డి సింగరేణి ఓసి త్రీ లో భూములు కోల్పో యాడు. దీంతో ఆయనకు సింగరేణి సంస్థ సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం కల్పించారు. ఎనిమిది నెలలుగా సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కమలాకర్ రెడ్డి కొండంపల్లి క్రాస్ లో డ్యూటీ చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం డ్యూటీక వెళ్లి రాత్రి 11 గంటలకు డ్యూటీ దిగే సమయంలో మరో ఇద్దరు డ్యూటీ ఎక్కేందుకు వచ్చారు . మొత్తం నలుగురు సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉన్నారు. నగరంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కత్తి పట్టుకొని విధులు ముగించుకుని బండి ఎక్కే క్రమంలో కమలాకర్ రెడ్డి పై దాడి చేశాడు. దీంతో ఆయనకు నాలుగు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న మరో ముగ్గురు సెక్యూరిటీ గార్డ్లు ఆయన పట్టుకొని గాయపడిన కమలాకర్ రెడ్డిన సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆదివారం గణపురం పోలిస్స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశాడు.