Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్, గాదె రుక్మారెడ్డి హైస్కూల్లోని టెట్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శశాంక ఆదివారం తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ, హాజరు శాతం, సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షా వివరాలు, ఓఎంఆర్ షీట్, పేపర్ కోడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష పత్రాలను బందోబస్తు నడుమ తరలించాలని అధికారులను ఆదేశించారు. ఫాతిమా హైస్కూల్లో 240 మందికిగానూ 231 మంది హాజరైనట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. డీఈఓ అబ్దుల్ హై, తదితరులు పాల్గొన్నారు.