Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మెన్
నవతెలంగాణ-లింగాలఘణపురం
ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ ఎండీ పాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మృతుడి స్వగ్రామం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కుందారానికి వెళ్లి పాషా పార్థివ దేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. రోడ్డు ప్రమాద ఘటన పై మంత్రి ఆరా తీశారు. ఈ ఘటన దురదష్టకరమని అన్నారు. జర్నలిజానికి పాషా మృత తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు. స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ పాగల సంపత్ రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు అభి మానులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ పోకల జమునలింగయ్య, సిద్దిలింగం, సర్పంచ్ శాడ సుగుణ, ఎంపీటీసీ రజిత ఉపేందర్, జిల్లా నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీవారి, యాదగిరి, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.