Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవతెలంగాణ-కాటారం
వరంగల్ రైతు డిక్లరేషన్ను ప్రతి పల్లెకు, ప్రతి గడపకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని మాజీ మంత్రి ,మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండలంలో కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులతో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా కింద కౌలు రైతుల సహా ఎకరానికి రూ.15000 పెట్టుబడి సహాయం, ఉపాధి హామీ కూలీలకు రూ.12000 వేల ఆర్థిక సహాయంతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సమ్మయ్య, గ్రామ సర్పంచ్ రఘు రామ్ నాయక్, ఎంపీటీసీలు జాడీ మహేశ్వరి రమేష్, మహేష్ రవీందర్ రావు, రూపా దేవి, యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, నాయకులు చందు, రమేష్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.