Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘణపురం
మండలం లోని మందోనీగూడెం గ్రామపంచాయతీ పరిధి చిక్కులోని గూడెం, మందోని గూడెం గ్రామ ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం ఎంపీటీసీ మార్పు కృష్ణవేణిశ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం సొంత ఖర్చుల తో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బోల్ల సత్యనారాయణ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.