Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కె శైలజ
నవతెలంగాణ-జనగామ
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కె శైలజ అన్నారు. జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినం సందర్భంగా జనగామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జిల్లా న్యాయసేవా సంస్థ సంయుక్తంగా అవగాహన సదస్సు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పాల్గొని మాట్లాడారు. బాల కార్మికుల విషయంలో కఠిన చర్యలు ఉంటాయని, రూ.50వేల జరిమానా, మూడేండ్ల కారాగార శిక్ష విధిస్తారన అన్నారు. బాలబాలికలకు పధ్నాలుగు సంవత్సరాల వరకు నిర్భంధ విద్య ప్రభుత్వం కల్పిస్తుందని, పద్దెనిమిది సంవత్సరాల వరకు బాల కార్మికుల చట్టం వర్తిస్తుందని తెలిపారు. వ్యాపారస్తులు దీనిని గమనించి వారి స్వేచ్ఛను పరిరక్షించాలని కోరారు. బాల కార్మికులను బడిలో చేర్పించి చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ కుమార్ గారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ కే కవిత గారు, డిసీపీఓ రవికాంత్ గారు, సఖి ఇంఛార్జి జి విజయలక్ష్మి గారు, చిల్డ్రన్ టీం, ఐసీపీఎస్ ప్రణరు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పజ్జూరి గోపయ్య, పజ్జూరి జయహరి, పెద్ది వెంకటనారాయణ, మాశెట్టి అశోక్, చిన్నం నర్సింహులు, ఆకుల వేణుగోపాల్ రావు, గాదె శ్రీనివాసు, అవధూత నర్సయ్య, బజాజ్, తదితరులు పాల్గొన్నారు.